Header Banner

నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం శుభవార్త..! గౌరవ వేతనం పెంపుకు జీఓ విడుదల!

  Tue Apr 29, 2025 10:56        Politics

ఏపీ (AP)లో నాయీ బ్రాహ్మణులకు (Nai Brahmins) కూటమి ప్రభుత్వం (Kutami Govt) ఇచ్చిన హామీ (Promises) మేరకు గౌరవ వేతనం రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ జీఓ 130 (GO 130) విడుదలపై వారు హర్షం వక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu) కృతజ్ఞతలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల గౌరవ వేతనం పెంచిన సందర్భంగా శ్రీశైలంలోని శ్రీ స్వామి అమ్మవార్లకు 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం నెల వారీ భృతిని రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు ఈ జీవో వర్తించనుంది.
హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తోంది. అన్ని వర్గాల ప్రజల బాగు కోసం పరితపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళుతోంది.


ఇది కూడా చదవండి: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్! టెన్త్‌ పాసైనా చాలు.. 40,000 జీతంతో 1302 ఉద్యోగాలు!


అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా రంజకమైన పాలనను అందిస్తూ.. అందరితో శభాష్ అనిపించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం నాయీ బ్రహ్మణులకు శుభవార్త చెప్పింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపు విషయంలో దేవాదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు..
ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయీ బ్రాహ్మణులకు భృతిని పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నెలవారీ భృతిని రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 44, 6ఏ కేటగిరీ దేవాలయాల్లో కేశఖండన చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు వర్తించేలా ఈ జీవో జారీ చేసింది. నెలవారీ భృతిని 20 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కనీస మొత్తంగా 25 వేల రూపాయల భృతిని నాయీ బ్రాహ్మణులకు అందేలా నిర్ణయం తీసుకుంది.
ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ. 2 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలు 6ఏ కేటగిరీలోకి వస్తాయి. ఆలయాలకు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ తమకు అతి తక్కువ కమిషన్ మాత్రమే ఇస్తున్నారని, దానిని పెంచాలని ఎప్పటి నుంచో నాయీ బ్రాహ్మణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NaiBrahmins #HonorariumHike #AllianceGovernment #Chandrababu #APGovt #GO130 #TeluguNews